Chiranjeevi: ఫ్యాన్స్, సినీ కార్మికులకు క్యాన్సర్ టెస్టులు.. ఎన్ని కోట్లయినా ఇస్తా: మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సమాజసేవ:
ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. లాక్‌డౌన్ సమయంలో జూనియర్ ఆర్టిస్టులు, కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అంతేకాదు ఇండస్ట్రీలోని తన తోటి కళాకారులు ఎవరు కష్టాల్లో వున్నా సరే వారికి తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు చిరు. మొన్నామధ్య తమిళ నటులు పాకీజా, పొన్నాంబలంలకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్. ఇటీవల బలగం మొగిలయ్య అనారోగ్యం పాలైన సమయంలోనూ తానున్నానంటూ చికిత్సకు అవసరమైన ఆర్ధిక సాయం చేశారు.
క్యాన్సర్‌పై అవగాహ కల్పిస్తానన్న చిరు :
తాజాగా చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో నూతనంగా నిర్మించిన స్టార్ క్యాన్సర్ ఆసుపత్రిని చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై అవగాహనకు తనవంతు సాయం చేస్తానని తెలిపారు. అలాగే తన తోటి కళాకారులు, సినీ కార్మికులు, అభిమానులకు ఎన్ని కోట్లు ఖర్చయినా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని చిరు పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ క్యాన్సర్ బారినపడకూడదన్నదే తన ఉద్దేశమన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు.
చిరు వ్యాఖ్యలకు అపూర్వ స్పందన :
అలాగే ఇటీవల తనను కలిసిన విజయవాడకు చెందిన రేణుక అనే అమ్మాయి కథను కూడా చిరంజీవి పంచుకున్నారు. ఆ అమ్మాయి క్యాన్సర్‌తో బాధపడుతోందని.. చిరంజీవిని చూడాలన్నదే తన చివరి కోరిక అని చెప్పిందని గుర్తుచేశారు. అయితే తాను ఆ అమ్మాయిని కలిసి.. ఇదే నీ చివరి కోరిక కాదమ్మా, మొదటి కోరిక అనుకోవాలని ఆత్మవిశ్వాసం కలిగించానని చిరంజీవి వెల్లడించారు. ఇప్పుడు రేణుక ఆరోగ్యం బాగానే వుందని చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం.. ఆయన చెప్పినట్లుగానే చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ వాహనాలు, డాక్టర్లు అందుబాటులో వున్నారని.. జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తామని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com