తెలుగు సినీ పరిశ్రమ విశాఖ తరలి రావడానికి సిద్ధంగా ఉంది - మెగాస్టార్ చిరంజీవి
Monday, April 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నచిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 22న సరైనోడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్ స్పెషల్ ప్రొగ్రామ్ సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం.
థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ... బ్రహ్మా, విష్ణు, మహేశ్వర్లు ని నేను చూసాను. వాళ్లు ఎవరో కాదు..చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనే పదానికి నిదర్శనం వీళ్లే. మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఒక ఎపిసోడ్లో నటించాను. అల్లు అర్జున్ ని ఉద్దేశించి...బాబు మంచి ఊపు మీద ఉన్నాడు. అవుట్ అయినా కానీ బ్యాట్ ఇవ్వడు...అనే డైలాగ్ చెప్పాను. ఈ ఎపిసోడ్ అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...సరైనోడు సినిమాలో బ్లాక్ బష్టర్ సాంగ్ నా ఫేవరేట్ సాంగ్. మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఇలాంటి ఈవెంట్ వైజాగ్ లో చేయాలనుకోవడం..అల్లు అరవింద్ గారు భారీ స్ధాయిలో సరైనోడు ఫంక్షన్ వైజాగ్ లో చేయడం ఆనందంగా ఉంది. నేను అల్లుడా మజాకా సినిమాని వైజాగ్ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేయడంతో జర్నీ స్టార్ట్ చేసాను. అలాగే బోయపాటి శ్రీను తో నేను నిర్మించిన భద్ర సినిమా స్ర్కిప్ట్ వర్క్ వైజాగ్ లోనే చేసాం. ఆవిధంగా వైజాగ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు సరైనోడు టీమ్ అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ...బన్నితో గంట సేపు మాట్లాడితే ఆ గంటా సినిమా గురించే మాట్లాడతాడు. సినిమా అంటే అంత పిచ్చి. టాలెంట్, ఫేషన్ రెండూ బన్నిలో ఉన్నాయి. లెజెండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి బన్నిఅరగంట సేపు నాతో మాట్లాడాడు. ఆది పినిశెట్టి తమిళ్ హీరోగా చేస్తూ..తెలుగులో నెగిటివ్ రోల్ చేయడం అభినందించదగ్గ విషయం. సరైనోడు బన్ని, బోయపాటి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మూడు రోజుల క్రితం రవితేజని కలవడానికి ఇంటికి వెళితే... చిరంజీవి గారు పెళ్లిలో చేసిన డ్యాన్స్ మూమెంట్ చూపించాడు. చిరంజీవి గారు చేసిన డాన్స్ మూమెంట్ ని మళ్లీ మళ్లీ ఓ ఐదు సార్లు చూసాం. రవితేజ చిన్నపిల్లాడులా అలా చూపిస్తే 20 నిమిషాలు అలా చూస్తునే ఉన్నాం. చిరంజీవి గార్ని బిగ్ స్ర్కీన్ పై చూడడానికి మేమంతా వెయిట్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్స్ చాలా మంది చిరంజీవి గారితో సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నారు అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...1972లో గీతా ఆర్ట్స్ సంస్థ స్ధాపించాం. ఇప్పటి వరకు మా సంస్థలో 54 సినిమాలు నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ వైజాగ్ లో జరిగింది అంటే ఫస్ట్ చెప్పుకోవలసిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఈ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి మాకు ఎంతగానో సహకరించిన గంటా శ్రీనివాసరావుకి అభినందనలు తెలియచేస్తున్నాను. మెగా ఫ్యామిలీకి వైజాగ్ సిటీ ఇచ్చే గౌరవం ఎప్పటికీ మరువలేను. అలాగే బన్నికి కూడా ప్రత్యేకమైన స్ధానం ఇచ్చారు. చిరంజీవి గారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈరోజు ఈ స్ధాయికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకు ఈ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసిన చిరంజీవి గార్కి ధ్యాంక్స్ ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. బన్ని వాసు, బన్నికి మంచి స్నేహితుడు. ఈ ఫంక్షన్ చేయడంలో ఎంతగానో సహకరించాడు.బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి కావాల్సిన సరైన డైరెక్టర్. మళ్లీ ఎవర్రా బోయపాటి అనేలా ఈ సినిమాని తెరకెక్కించాడు. తమన్ మంచి మ్యూజిక్ అందించాడు. సరైనోడు సినిమా ఖచ్చితంగా అభిమానుల అంచనాలను రీచ్ అవుతుంది అన్నారు.
నిర్మాత సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... అల్లు అరవింద్ అద్భుతమైన స్కిల్ ఉన్న మనిషి. ఆయన ఇంత అద్భుతంగా వైజాగ్ లో ఈవెంట్ ఏర్పాటు చేసాడంటే అల్లు అర్జున్ అదృష్టవంతుడు. బన్ని కసి కసిగా నటుడు అయ్యాడు. చిన్నప్పటి నుంచి బన్నికి చిరంజీవి స్పూర్తి. గంగ్రోతిలో బన్ని ఏక్టింగ్ చూసి మంచి నటుడు అవుతాడని ఆరోజే అనుకున్నాను. హీరో ఎంత స్ట్రాంగ్ అయినా అందమైన హీరోయిన్ కావాలి. అల్లు అరవింద్ కి ఆ విషయం బాగా తెలుసు అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. బోయపాటి ఘటికుడు. చిరంజీవి గపొగుడుతున్నారంటే బోయపాటి ఎంత ప్రతిభావంతుడో అర్ధం చేసుకోవచ్చు. సరైనోడు సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... అన్నయ్య తో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ లో నటించాను. రామ్ చరణ్ తో గోవిందు అందరివాడేలే సినిమాలో నటించాను. ఇప్పుడు బన్నితో సరైనోడు సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిరంజీవి గారు ఎలా కష్టపడ్డారో.. అలా బన్ని, చరణ్ కష్టపడుతుండడం చూసాను. చిరంజీవి కొడుకు అని చరణ్ కి కానీ, నిర్మాత కొడుకు అని బన్నికి ఎలాంటి గర్వం లేదు. వాళ్ల పడుతున్న కష్టం చూస్తుంటే మేము అంతగా కష్టపడలేదు అనిపించింది. బన్నిని చూసి చాలా నేర్చుకోవాలి. రుద్రమదేవి సినిమాలో బన్ని యాక్షన్ చూసి షాక్ అయ్యాను. నెక్ట్స్ జనరేషన్ బన్ని, చరణ్, పవన్, ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోవాలి. నా కొడుకుతో... ఇన్ స్టిట్యూట్ కి వెళ్లనవసరం లేదు బన్నిఎలా యాక్ట్ చేస్తున్నాడో చూడు అని చెప్పాను. ఈ సినిమాలో బన్నితో కలసి డాన్స్ మూమెంట్ చేయడం హ్యాఫీగా ఫీలవుతున్నాను. ఆర్టిస్టుల నుంచి తనకు ఏం కావాలో క్లారిటీ ఉన్న డైరెక్టర్ బోయపాటి . ఈ సినిమా బ్లాక్ బష్టర్ అవుతుంది అన్నారు.
గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ... తుఫాన్ ను తట్టుకున్న ఉక్కునగరం విశాఖనగరం. అందుచేత చిన్న చిన్న ఓటమి ఎదురైనప్పుడు విశాఖ ప్రజలను తలుచుకుంటే చాలు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ గారు దగ్గర నుంచి అమలాపురంలోని సగటు ప్రేక్షకుల వరకు అందరూ పాడుకునేలా మై ఎమ్మెల్యే...అనే పాట రాసాను. ఈ పాటకి మంచి ట్యూన్ ఇచ్చిన తమన్ గార్కి ధ్యాంక్స్ అన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ...అందరికీ నచ్చేనగరం విశాఖనగరం. ప్రపంచ పటంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న విశాఖనగరంలో సినిమా రంగానికి శ్రీకారం చుడుతూ సరైనోడు ఫంక్షన్ ని ఇక్కడ చేసిన అల్లు అరవింద్ గార్కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి గారు రావడంతో నిండుతనం వచ్చింది. బన్నిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తనని తాను మార్చుకుంటూ అందరి అంచనాలను మించిపోతున్నాడు. సరైనోడు సినిమాలో ఉన్న పాటలా ఈ సినిమా బ్లాక్ బష్టర్ కావాలని...సరైనోడు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా వైజాగ్ లోనే చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ...గత 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ప్రతి హీరో పై చిరంజీవి గారి ప్రభావం ఉంది. అందుచేత నా లెక్క ప్రకారం చిరంజీవి గారు ఎప్పుడో 500 సినిమాలను క్రాస్ చేసేసారు. బన్ని గురించి చెప్పాలంటే ఆర్య సినిమాకి ఫ్రెండ్ అయ్యాడు. దేశముదురు సినిమాకి అన్నయ్య అయితే రేసుగుర్రం సినిమాకి నాకు గురువు అయ్యాడు. బన్నిని ఇప్పటి వరకు మాస్ గా చూసాం. ఫస్ట్ టైం ఊర మాస్ గా చూపించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గార్కి థ్యాంక్స్. రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో ఎంటరైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్, బన్ని ఫేవరేట్ హీరోలు అని చెబుతుంది. బన్నితో నటించింది త్వరలో కళ్యాణ్ గారితో కూడా రకుల్ నటించాలని కోరుకుంటున్నాను అన్నారు.
తమన్ మాట్లాడుతూ...బన్ని అంటే నాకు చాలా ఇష్టం. బన్ని సినిమాకి వర్క్ చేయడం అంటే హ్యాఫీగా ఫీలవుతుంటాను. బోయపాటి చాలా టెన్షన్ గా ఉంటారు అని తెలిసి ఆయనతో వర్క్ చేయడం ఎలా అనుకున్నాను. చాలా భయపడ్డాను. ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మూడు నాలుగు రోజులు ఆయన్ని రీచ్ అవ్వాడానికి కాస్త టైమ్ పట్టింది. ఆతర్వాత ఆయన నాకు ఓ బ్రదర్ లా అనిపించారు. రేసుగుర్రం కంటే మంచి ఆల్బమ్ వచ్చినందుకు హ్యాఫీగా ఫీలవుతున్నాను. అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇది. మంచి సంస్థలో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. నా లైఫ్ లో బెస్ట్ ట్రైలర్ అంటే సరైనోడు ట్రైలర్. చిరంజీవి గారి 150 సినిమా కోసం అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ...వైజాగ్ రాగానే నాకు ఛాలెంజ్ సినిమా గుర్తుకువచ్చింది. ఈ చిత్రంలో జనం కోసం పారాడే ఐఎ.ఎస్ పాత్ర పోషించాను. ఛాలెంజ్ సినిమాతో నా జీవితం ప్రారంభమయ్యింది .ఎంతో మందికి స్పూర్తి అన్నయ్య. రకుల్ ప్రీత్ సింగ్, శ్రీకాంత్, ఆది..ఇలా మంచి టీమ్ తో చేసిన మంచి సినిమా సరైనోడు. నేను ఇప్పటి వరకు 1000 సినిమాలుకు డబ్బింగ్ చెప్పాను.ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించడం అనేది డైరెక్షన్ టీమ్ చేస్తుంటారు. కానీ.. డబ్బింగ్ చెబుతున్నప్పుడు డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఫస్ట్ టైమ్ చూసాను. ఒక్కమాటలో చెప్పాలంటే బోయపాటి పని రాక్షసుడు. ఇలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... నా మూవీ టాక్ తెలుసుకోవాలంటే వైజాగ్ టాక్ ఏమిటి అనేది తెలుసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మూవీ ని ఎంతగానో లవ్ చేస్తారు. ఒక ఏక్టర్ కి ఏ బాడీ లాంగ్వేజ్ సరిపోతుంది అనేది డైరెక్టర్ బోయపాటి శ్రీను గార్కికి బాగా తెలుసు. బన్నితో కలసి పని చేసిన తర్వాత రెస్పెక్ట్ పెరిగింది. తెలుసా తెలుసా అనే మంచి సాంగ్ ఇచ్చిన తమన్ కి థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు అరవింద్ గార్కి, బోయపాటి గార్కి థ్యాంక్స్ అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ...ఆడియో పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం తమన్. ఈ మూవీకి మంచి రీ రికార్డింగ్ ఇచ్చినందుకు తమన్ కి థ్యాంక్స్. ఈ సినిమాని అరవింద్ గారు నా భుజంపై పెట్టారు. ఒక మంచి సినిమా తీసాం. న్యాయం నాలుగు కాళ్ల మీదే నిలబడాలి. అన్యాం నిలడకాదు అనేది ఈ సినిమా. నాకు ఎంతగానో సహకరించిన రైటర్ రత్నం, గోపీ మోహన్, రాజ సింహా మిగిలిన నా టీమ్ అదరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గుంటూరు లో ఈనాడు విలేఖరిగా పనిచేసాను. ఆతర్వాత రామోజీరావు గారి చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు తీసుకున్నాను. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించిన అన్నయ్య సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసాను. ఇప్పుడు అదే సంస్థలో డైరెక్టర్ గా సినిమా చేయడం ఆనందంగా ఉంది. అరవింద్ గార్కి అన్నిరంగాల మీద అద్భుతమైన అవగాహన వుంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రంలో శ్రీకాంత్ బన్నికి బాబాయ్ క్యారెక్టర్ చేసాడు.
తన చుట్టూ ఉన్న వాళ్లు మంచి గా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి శ్రీకాంత్. హీరోయిన్ రకుల్ లుక్ కొత్తగా చూపించాను. తనని చూసిన తర్వాత ఈ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయిలా ఉంది అనిపిస్తుంది. కేధరిన్ ఎమ్మేలేగా నటించింది. ఆ పాత్రను ఆమె తప్ప ఇంకెవరు చేయలేరనిపిస్తుంది. అలాగే అంజలి స్పెషల్ సాంగ్ చేసింది. మంచి వ్యక్తులతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. హీరో పవర్ తెలియాలంటే ఢీ అంటే ఢీ అనే విలన్ ఉండాలి. అలా ఎవరైతే బాగుంటారని ఆలోచిస్తున్నప్పుడు ఆది పినిశెట్టి చేస్తే బాగుంటుంది అనిపించింది. 25 నిమిషాలు కథ చెప్పాగానే నేను చేస్తాను అన్నాడు. తమిళ్ లో హీరోగా చేస్తూ ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆదిని అభినందిస్తున్నాను. గంగోత్రి అయిన తర్వాత బన్నికి ఓ కథ చెప్పాను. అయితే...ఆ సినిమా తను చేస్తే లవర్ బోయ్ లుక్ పోతుందని చెప్పి దిల్ రాజు గారికి ఫోన్ చేసి నాకు అడ్వాన్స్ ఇప్పించి నేను డైరెక్టర్ అవ్వడానికి కారణమైన బన్నితో ఇప్పుడు ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే... చేసిన మేలు మరచిపోకూడదు. ప్రతిభ దేవుడి ఇస్తాడు వినయంగా ఉండు... కీర్తి మనుషులు ఇస్తారు జాగ్రత్త ఉండు ఈ రెండు తెలిసి నడుచుకునేవాడు బన్ని. అలాగే కృషి ప్లస్ కషి కలిస్తే బన్ని. ఈ బ్యానర్ లో మళ్లీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న చినుకులా సినీ ప్రస్ధానం ప్రారంభించి.. ఈరోజు విశాఖ సముద్రం అంత ఎదిగారు చిరంజీవి గారు. ఆయన నుంచి స్పూర్తి తీసుకోవాలి. అలాంటి వ్యక్తితో అన్నయ్య సినిమాకి వర్క్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. సముద్ర అలలకు వెల కట్టలేం అలాగే అభిమానులకు వెలకట్టలేం. మీరు గుండె మీద చేయి వేసుకుని సినిమా చూడండి అన్నారు.
ఆది మాట్లాడుతూ..చిరంజీవి గార్ని చూస్తే చాలు మాటలు రావు. ఈ వేడుక చూస్తుంటే... మేరినా బీచ్ లో యుముడికి మొగుడు ఫంక్షన్ గుర్తుకువస్తుంది. ఆడియోన్స్ ప్లన్ తెలిసిన బోయపాటి గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మా అందరికీ సరైనోడు స్లలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా బ్లాక్ బష్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...నాకు ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఈ ఆడియో ఫంక్షన్ వైజాగ్లో చేయాలనుకున్నాను. అది జరిగినందుకు హ్యాఫీగా ఉంది. ఆర్య సినిమా షూటింగ్ వైజాగ్ లో ఇదే రోడ్ లో చేసాం. అప్పుడు నా సినిమా 100 డేస్ ఫంక్షన్ ఇక్కడ చేయాలనుకున్నాను. నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. కథ చెప్పిన వెంటనే బాబయ్ పాత్ర చేయడానికి వెంటనే అంగీకరించిన శ్రీకాంత్ అన్నయ్యకి మనస్పూర్తిగా థన్యవాదాలు.తెలియచేస్తున్నాను. ఆది, నేను చిన్నప్పుడు కరాటే నేర్చుకునే వాళ్లం. చైల్డ్ హుడ్ ఫ్రెండ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎంత అందగత్తో అంత తెలివైంది. అంతకు మించి మంచిది. అందం, తెలివి, మంచితనం ఈ మూడు లక్షణాలు ఉన్న అమ్మాయి రకుల్. ఈ సినిమాలో మంచి పాత్ర పోషించింది. బోయపాటి ఈ సినిమాతో ఆల్ రౌండర్ డైరెక్టర్ అనిపించుకుంటారు. ఊర మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. ఈ నెల 22న రాబోతున్నాం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నేను చేసిన మూడవ సినిమా ఇది. నాన్న గారు నా మార్కెట్ కంటే కాస్త ఎక్కువే ఖర్చు పెట్టారు. నాతో మంచి సినిమా తీయాలని ప్రయత్నించిన నాన్నకు ధ్యాంక్స్. మెగాస్టార్ చిరంజీవి గార్ని ముఖ్య అతిధిగా రావాలని నా ఫస్ట్ సినిమా నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఈరోజు నా కోసం వైజాగ్ వచ్చింనకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ ..మా అందరికీ రోడ్ వేసిన చిరంజీవి గార్కి మరోసారి థ్యాంక్స్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... వైజాగ్ ఎప్పడూ వచ్చినా సరే..నాలో ఏదో పులకింత. ఈ సిటీతో నాకు అవినాభవ సంబంధం ఉంది. అది నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సరైడోడు ఆడియో విజయోత్సవం కు నేను చీఫ్ గెస్ట్ గా రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గీతాఆర్ట్స్. రెండు విశాఖ వాసులు. ఈ తీరంలో ఎప్పుడు ఉన్నా యురేకా..అంటూ అభిలాష సినిమాలో నేను వేసిన స్టెప్స్ , ఇందుమధన అంటూ సాగే ఛాలెంజ్ సినిమాలో సాంగ్, మాస్ ని అలరించిన బంగారు కొడిపెట్టి ..ఇలా ఎన్నో సినిమాల కోసం వైజాగ్ లో ఆడాను పాడాను. ఆరకంగా తియ్యటి అనుభూతి. నా రిటైర్మెంట్ లైఫ్ ని విశాఖలో గడపాలనుకుంటున్నాను. అందుచేత విశాఖలో స్ధిరనివాసం ఏర్పరుచుకోవాలనుకుంటున్నాను. అరవింద్ లో అప్పుడు ఎంత పట్టుదలో..ఇప్పుడు అదే పట్టుదల. ఆయన ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుంటారు. తెలుగు, హిందీ భాషలో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారంటే కారణం ఆయన ప్రతిభ. నా నిర్మాతగా, బంధువుగా గీతా ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ ని అభినందిస్తున్నాను. బన్ని చిన్నప్పటి నుంచి తెలుసు.నాకు చరణ్ ఎంతో బన్ని కూడా అంతే. కలసిమెలిసి పెరగిడాడు. వాడి విజయం చూస్తుంటే గర్వంగా ఫీలవుతుంటాను. మేము గర్వపడేలా కష్టపడుతున్నాడు. బన్ని టాలెంట్ దృష్టిలో పెట్టుకుని డాడీలో చిన్న సీక్వెన్స్ చేయించాను.
బన్ని లో నటన పై ఆసక్తి కలిగేలా బీజం వేసినవాడిని నేను అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అవకాశాలు రావడం ఒక ఎత్తు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. మా ఇంట్లో ఉన్న యంగ్ హీరోస్ కి ఒకటి చెబుతుంటాను. మెగా ఫ్యాన్స్ రెడీమేడ్ లా ఉన్నారంటే ఎదురుదెబ్బలు తగులుతాయి. మీరు నమ్ముకోవాల్సింది కష్టం. అలా చేస్తే ఎదురు ఉండదు అని. వాళ్లు దాన్ని ఆచరిస్తుండడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈరోజు బన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళలో ఎంతో మంది అభిమానులును సంపాదించుకున్నందుకు సంతోషపడుతున్నాను. బన్నిలో నటుడుగా పరిణితిని చూస్తున్నాను. వ్యక్తిగా హుందాతనం చూస్తున్నాను. బన్నిలో ఒక డెప్త్ పర్ ఫార్మెన్స్ చూడలేదు అనుకుంటున్న టైంలో గోన గన్నారెడ్డి గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. రుద్రమదేవి సినిమా అలరించింది అంటే ప్రధాన కారణం బన్ని. ఆతర్వాత సత్యమూర్తిగా సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చేసాడు. రేసుగుర్రం సినిమాతో పరిణితి ఉన్న నటుడుగా తనని తను ఆవిష్కరించుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. సరైనోడు సినిమాకి పూర్తి స్ధాయి న్యాయం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైనోడులో క్యారెక్టర్ మాస్ ఊర మాస్ అని చెబుతుంటే నాకే ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది.
నాకు తమ్ముడు పవన్ ఎలాగో శ్రీకాంత్ అలా..మరోక తమ్ముడు. అంత ప్రేమ మా మధ్య ఉంది. మా ఫ్యామిలీ నుంచి సినిమా వచ్చింది అంటే...ఏమైనా సరే చేయాలి అని చేస్తాడు. తన పాత్రతో నిండుతనం తీసుకువచ్చినందుకు అభినందిస్తున్నాను. డైరెక్టర్ బోయపాటి శ్రీను లో ఆ ఎనర్జీ, పట్డుదల పరితపించే విధానం చేస్తుంటే శభాష్ అనిపిస్తుంది. అసోసియేట్ డైరెక్టర్ ని మా స్ధాయి హీరోలు గుర్తుంచుకోరు. కానీ బోయపాటిని మరచిపోలేను. అన్నయ్య సినిమా చేస్తున్నప్పుడు నాకు వచ్చిన సందేహాలు అన్ని బోయపాటి తీర్చేవాడు. పక్కా మాస్ అనేదానికి అడ్రస్ అంటే బోయపాటి, సెంటిమెంట్ - యాక్షన్ ఏదైనా పట్టు సడలకుండా ఉండేలా సినిమాని తీర్చిదిద్దుతాడు. మాస్ డైరెక్టర్ గా తెలుగు స్ధామినాని మరో స్ధాయికి తీసుకెళ్లిన బోయపాటిని అభినందిస్తున్నాను. సరైనోడుకి సరైన డైరెక్టర్ బోయపాటి. తను తీసిన సింహ, లెజెండ్ కథలు నా దగ్గరికి వచ్చి వినిపించాడు. కొన్ని మార్పులు చేర్పులు చెప్పాను. అయితే...సరైనోడుకథ చెప్పాడు. నేను నోరు మెదపలేదు. ఇది పెద్ద హిట్ అవుతుంది అని చెప్పాను.
150 సినిమా అయినా తర్వాత బోయపాటి ఓ లైన్ చెప్పే అవకాశం ఉంది చేద్దామా అన్నారు అల్లు అరవింద్ గారు. ఓకె అన్నాను. ఈనెల 22న సరైనోడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది తమిళ్ లో హీరోగా రాణిస్తూ తెలుగులో విలన్ గా నటించాడంటే తనలోని తృష్ట ఏమిటనేది తెలుస్తుంది. ఆదికి బంగారు భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను. తమన్ మా హీరోలందరికీ చక్కటి మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రతి సాంగ్ ఆణిముత్యంలా అదించాడు. ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి నా విన్నపం. రెండు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ అభివృద్ది చెందాలి. విశాఖపట్నంలో గ్లామర్ ఫీల్డ్ సినిమా పరిశ్రమ మరింత అభివృద్ది చెందాలి అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం అనడం కంటే... చిత్రపురి కాలనీలా 24 క్రాఫ్ట్స్ కి స్థలం కేటాయిస్తున్నాం. రండి అంటే ఇండస్ట్రీ ఇక్కడకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా సినిమా పరిశ్రమ అభివృద్ది చెందాలి అని కోరకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments