నాకు పోటీ లేనే లేదు - మెగాస్టార్

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ భారీ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై రూపొందిన ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇదిలా ఉంటే...నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించారు. ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
అయితే...మెగాస్టార్ చిరంజీవిని సంక్రాంతికి పోటీప‌డుతున్న రెండు చిత్రాల గురించి అటు ఆడియోన్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి నెల‌కొంది. ఈ పోటీ గురించి మీరేమంటారు అని అడిగితే...పోటీ అనేది నాకు లేనే లేదు. నా 150వ చిత్రం టైమ్ లో బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రిలీజ్ కావ‌డం అనేది అనుకోకుండా జ‌రిగింది. నా 150వ సినిమా ఖైదీ నెం 150, బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఒకేసారి రిలీజ్ అవుతుండ‌డంతో మీడియా క్రియేట్ చేసిన పోటీ ఇది. సంక్రాంతికి వ‌చ్చే అన్ని సినిమాలు స‌క్సెస్ సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

More News

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు.

హాయ్ లాండ్ లో మెగా ఈవెంట్ కు సర్వ సన్నాహాలు

బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి బరిలో దూసుకొచ్చేస్తున్నాడు బాస్. విజయవాడ-గుంటూరు మధ్యలో చినకాకాని పరిసరాల్లోని హాయ్ల్యాండ్లో ప్రీరిలీజ్ వేడుక సంబరాలు స్పీడందుకున్నాయి.

నితిన్ సినిమా స్టార్ట్ అయ్యింది..!

యువ హీరో నితిన్ హీరోగా అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవ పూడి దర్శకత్వంలో

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'బంగారు తెలంగాణ' - నిర్మాత డా. లయన్ ఎ.వి.స్వామి

బిపిన్,రమ్య జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకం పై శ్రీమతి రమ్య సమర్పణలో బిపిన్ దర్శకత్వంలో

పేరు మార్చుకున్న బాల‌య్య‌..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 12న‌ వ‌రల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.