అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అన్న విషయం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులకు నేడు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. నిజానికి ఆయనకు కరోనా సోకలేదని.. ఆర్టీ పీసీఆర్ తప్పిదం కారణంగా ఫలితం అలా వచ్చిందని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మూడు వేర్వేరు టెస్ట్‌లను నిర్వహించిన అనంతరం వెల్లడించారని మెగాస్టార్ తెలిపారు. ఈ సమయంలో తనపై ప్రేమాభిమానులు చూపించిన వారందరికీ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైద్యులు తనకు నిర్వహించిన టెస్టులు, ఆ టెస్టుల్లో వచ్చిన ఫలితాలన్నిటినీ వెల్లడించారు.

‘‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరువాత, బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోల్ డాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేసెస్ లేవన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చాక, మరొక్కసారి మరోచోట నివృత్తి చేసుకుందామని నేను టెనెట్ ల్యాబ్‌లో 3 రకాల కిట్స్‌తో టెస్ట్ చేయించాను. అక్కడా నెగిటివ్ వచ్చింది.

ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ కిట్ తప్పిదం వలన వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన కన్సర్న్, ప్రేమాభిమానాలకు, చేసిన పూజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్‌కి కరోనా నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో ‘ఆచార్య’ షూటింగ్ వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More News

జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ ఫిక్స్!

జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

క్రాకర్స్‌పై నిషేధం... కేవలం రెండు రోజుల ముందా?

దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

సెట్స్‌లోకి బ‌న్నీ.. కాన్సెప్ట్ ఇదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

'మా వింత‌గాథ వినుమా' ప్రీ రిలీజ్

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌వుతుంది.

'రంగ్ దే' చిత్రం నుంచి 'ఏమిటో ఇది' తొలి గీతం విడుదల

యూత్ స్టార్ నితిన్ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల