వివాదంలో..చిరు 150వ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్నిసంవత్సరాలుగా అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మార్చి 27న చరణ్ పుట్టినరోజు నాడు చిరు 150వ సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. చిరు 150వ సినిమాగా కత్తి రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రేజీ మూవీకి వినాయక్ డైరెక్టర్ అని ఫైనల్ చేసారు కూడా.
అంత బాగానే ఉంది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుండగా..వివాదంలో చిక్కుకుంది చిరు కత్తి రీమేక్. ఇంతకీ విషయం ఏమిటంటే...కత్తి సినిమా కథ నాదే అంటూ రచయిత ఎన్.నరసింహారావు ఫిర్యాదు చేసారు. నరసింహారావు ఫిర్యాదు మేరకు కథా హక్కుల వేదిక ఛైర్మెన్ దాసరి నారాయణరావు రంగంలో దిగారు. కత్తి కథ నాదే అని నరసింహారావు అంటున్నారు కాబట్టి ఈ విషయం తేలేకే కత్తి రీమేక్ ప్రారంభించాలి అంటున్నారు. అలా చేయకపోతే దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి...కత్తి రీమేక్ వివాదం పై చిరు కౌంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout