‘ఆచార్య‌’లో చిరు పాత్ర ఎలా ఉంటుందంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు.  హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఈ సినిమా చిరంజీవి పాత్ర గురించి చాలా ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు చిరంజీవి ఈ చిత్రంలో మాజీ న‌క్స‌లైటు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం దెబ్బ‌తిన‌నీయ‌కుండా పోరాడే వ్య‌క్తి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. సినిమాలో చిన్నపాటి రాజ‌కీయాంశాలు కూడా ముడిప‌డి ఉంటాయ‌ట‌.

మంచి మెసేజ్‌ల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కొర‌టాల ఒక‌రు. ఆచార్య సినిమాను కూడా అలాగే తెర‌కెక్కిస్తార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ న‌క్స‌లైట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌న‌డ‌ప‌డ‌తాడ‌ని, ఆ పాత్ర వ‌ల్ల‌నే చిరు మార్గ‌నిర్దేశం పొందుతాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌రోనా ప్ర‌భావంతో ఆచార్య చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో పోటీ ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేస్తాం: కేసీఆర్

తెలంగాణలో ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం

ప్ర‌భాస్ జ‌త‌గా చేయ‌డానికి భారీ డిమాండ్ చేసిన బ్యూటీ

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లు ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌పై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మే-03 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం..

'ఆర్ఆర్ఆర్‌'ని చిరంజీవి ప్రొడ్యూస్ చేయాల‌నుకున్నారా?

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్‌). టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘కరోనా’ సర్వే!

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై పోరు చేస్తూ సర్వే జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటి వరకూ మూడు సర్వేలు పూర్తి చేయడం జరిగిందన్నారు.