అదే వేడి, అదే వాడి, అదే పవర్!: ‘వకీల్ సాబ్’కు చిరు రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళుతోంది. సినీ కెరీర్ పరంగానే కాకుండా.. రాజకీయాల పరంగా కూడా కలిసొచ్చేలా ఈ సినిమాను ఉందనే టాక్ బాగా నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. బాలీవుడ్ మూవీ ‘పింక్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్.. పవన్ అభిమానులకు నచ్చేలా సినిమాను రూపొందించినప్పటికీ కంటెంట్ చెడకుండా చూసుకోవడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని పవన్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ఆందోళన కాస్త ఆయన అభిమానుల్లో నెలకొంది. అయితే తొలి షోతోనే అనుమానాలకు, ఆందోళనలకు ఈ సినిమా ఫుల్ స్టాప్ పెట్టేసింది. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఇప్పటి వరకూ వచ్చిన రివ్యూలన్నీ చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసి దీనికి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపి సినిమా ఎలా ఉందో వివరించారు. మూడేళ్ల తర్వాత అదే వేడి.. అదే వాడి అదే పవర్‌తో పవన్ వచ్చారంటూ చిరు పేర్కొన్నారు.
‘‘మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్ - అదే వేడి, అదే వాడి, అదే పవర్! ప్రకాష్‌రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం! నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ కపూర్ గారికి, డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కి మిగతా టీమ్‌కి నా శుభాకాంక్షలు. అన్నిటికీ మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు, అందరి మనసుల్నీ గెలుస్తాడు!’’ అంటూ ట్విటర్ వేదికగా రివ్యూ ఇచ్చేశారు. మెగాస్టార్ తన భార్య, తల్లి, పిల్లలతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఇప్పుడు ఈ పిక్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Terrific Act by @PawanKalyan
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2021
Riveting court room drama with @prakashraaj @i_nivethathomas @yoursanjali #Ananya @MusicThaman #DOPVinod did a Fab job! Congrats to #DilRaju @BoneyKapoor ji Dir #VenuSriram & Team.Most of all Hugely Relevant film on respecting women.#VakeelSaab WINS! pic.twitter.com/lTT0cYoyy7
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments