ఏప్రిల్ 8.. సీక్రెట్ చెప్పిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో రీసెంట్‌గా ఏప్రిల్ 8న తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. దాంతో అందరూ ఏంటా అనుబంధం? అని ఆలోచనలో పడ్డారు. చివరకు ఈరోజు అంటే ఏప్రిల్ 8న తనకున్న అనుబంధాన్నిచిరంజీవే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ అనుబంధమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది(ఓ అంజనేయ స్వామి బొమ్మను చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు). అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. ఎందుకంటే ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. (చిరు తన చిన్ననాటి ఫొటోను కూడా పోస్ట్ చేశారు). అలాగే కొన్ని దశాబ్దాల తరవాత, 2002లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతానన్నారు. నేను అది పాలరాతి మీద రీ ప్రొడ్యూస్ చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు" అన్నారు. (బాపు వేసిన బొమ్మను కూడా చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు) చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు’’ అన్నారు.
కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments