ఏప్రిల్ 8.. సీక్రెట్‌ చెప్పిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లో రీసెంట్‌గా ఏప్రిల్ 8న త‌న‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంద‌ని చెప్పారు. దాంతో అంద‌రూ ఏంటా అనుబంధం?  అని ఆలోచ‌న‌లో పడ్డారు. చివరకు ఈరోజు అంటే ఏప్రిల్ 8న‌ త‌న‌కున్న అనుబంధాన్నిచిరంజీవే ట్విట్ట‌ర్ ద్వారా  తెలియ‌జేశారు. ఆ అనుబంధమేంటో ఆయ‌న మాటల్లోనే తెలుసుకుందాం.

‘‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి...1962 లో నాకు  ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది(ఓ అంజ‌నేయ స్వామి బొమ్మ‌ను చిరు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు). అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. ఎందుకంటే ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి అన్నారు. (చిరు త‌న చిన్న‌నాటి ఫొటోను కూడా పోస్ట్ చేశారు). అలాగే కొన్ని దశాబ్దాల తరవాత, 2002లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతానన్నారు. నేను అది పాలరాతి మీద రీ ప్రొడ్యూస్‌ చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?  ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు అన్నారు. (బాపు వేసిన బొమ్మను కూడా చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు) చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు’’ అన్నారు.

More News

పాన్ ఇండియా చిత్రంగా అల్లు అర్జున్ 20.. టైటిల్ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే చిత్రానికి టైటిల్‌ను ‘పుష్ప‌’ అని ఖ‌రారు చేశారు. ఎప్పుడెప్పుడు టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌వుతుందా?

నా పుట్టిన‌రోజు మీరు చేయాల్సిన ప‌ని అదే: అఖిల్‌

ఏప్రిల్ 8.. రేపు బుధ‌వారం స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్‌, యూత్ కింగ్ అఖిల్ అక్కినేని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అఖిల్ అక్కినేని అభిమానుల‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

పవన్ - రవితేజ: ఈ క్రేజీ కాంబినేష‌న్ కుదిరేనా?

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ అనౌన్స్‌మెంట్ ముందు నుండే భారీ అంచ‌నాలను ఏర్ప‌రుచుకుంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి.

ఇలియానా షాకింగ్ డెసిష‌న్‌..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను

అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

ఈరోజు వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశ‌మంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు.