Mangalavaram:‘మంగళవారం’ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరు.. కలెక్షన్స్‌తో దుమ్మురేపుతున్న బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
RX100, మహాసముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తు్న్న మంగళవారం చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. డార్క్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్త నిర్మాణంలో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
రూ.50కోట్లు దాటిన 'భగవంత్ కేసరి' కలెక్షన్స్
'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న నటసింహం బాలకృష్ణ తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.32.33కోట్లు సాధించిన ఈ మూవీ..రెండో రోజు మరో రూ.18.50 కోట్లు దక్కించుకుని రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండు రోజులోనే ఈ సినిమా రూ.51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. దసరా సెలవులు ఉండటంతో ఈజీగా రూ.100 కోట్లు వసూలు చేయనుంది.
రజనీ, లోకేష్ సినిమాలో విలన్‌గా మలయాళ హీరో?
'జైలర్' మూవీతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్.. 'లియో'తో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న లోకేష్ కనగరాజ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించనున్నట్లు సమాచారం.
మూడు భాగాలుగా ‘మహాభారతం‘..
'కశ్మీర్ ఫైల్స్', 'ది వ్యాక్సిన్ వార్' వంటి సినిమాలతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. 'పర్వ' పేరుతో ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. కన్నడ రచయిత ఎన్.ఎల్. బైరప్ప రచించిన ‘పర్వ’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నట్లు వివేక్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com