Chiranjeevi: పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి.. చరణ్ భావోద్వేగం..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తన నటన, డ్యాన్సులు, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల మనసు సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చిరు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రామ్‌చరణ్ దంపతులు, చిరు సతీమణి సురేఖ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కాగా గతంలోనే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం విధితమే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను పలు రంగాల ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. ఇక మిగిలిన వారికి ఇప్పుడు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.
ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. అసాధారణమైన విశిష్ట సేవకు పద్మవిభూషణ్, ఉన్నతస్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, విశిష్ట సేవలకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడం అనావాయితీగా వస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన అవార్డుల ప్రదానం కార్య్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు మరికొంత మందికి పురస్కారాలు ప్రదానం చేశారు.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. 'బింబిసార'తో బ్లాక్బాస్టర్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట.. ఈ మూవీతోనూ మెగాస్టార్‌కు మరిచిపోలేని విజయం అందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout