డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో చిరు- చరణ్ జోరు : ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న ‘‘ఆచార్య’’ ట్రైలర్

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం.. కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి చిరు నటించడంతో ఆచార్యపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకే పరిస్థితులు చక్కబడటంతో ఏప్రిల్ 29న ఆచార్యను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగాస్టార్ అభిమానులు డిజాప్పాయింట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం ఈరోజు ఆచార్య ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

రామ్‌ చరణ్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అద్భుతంగా వుంది. 'ఇక్కడ అందరూ సౌమ్యులు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ... కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కు మని ఉంటామేమో అని భ్రమ పడి ఉండొచ్చు.

ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుద్ది' .. 'ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది?'

'పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలు వేస్తే... ఆ కాలు తీసేయాలి. కాకపోతే అది కాలా? అని!',

'నేను వచ్చానని చెప్పాలనుకున్నా. కానీ, చేయడం మొదలు పెడితే...'

వంటి డైలాగ్‌లు బాగా పేలాయి. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్‌, ఫైట్స్ చూస్తుంటే అభిమానులకు విందు భోజనమేనని అర్థమవుతుంది. ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తోంది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

More News

తండ్రి కలను నిజం చేసిన అలీ కూతురు.. మురిసిపోతున్న కుటుంబం, ఫ్యాన్స్ విషెస్

పిల్లలు పుట్టగానే సరిపోదు.. వాళ్లు పెరిగి ప్రయోజకులై , వారి గురించి నలుగురూ చెబితే వినాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు.

దటీజ్ రామ్ చరణ్.. మంచి మనసుకు ఈ ఘటనే నిదర్శనం , కాదంబరి కిరణ్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

ఏపీ కొత్త కేబినెట్.. మంత్రులకు శాఖల కేటాయింపు, రోజాకు ఏ శాఖంటే..?

అలకలు, అసంతృప్తులు, ధిక్కార స్వరాలు, రాజీనామాలు , నిరసనలు ఇలా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై కనిపించిన పరిస్థితులు.

NTR @ 25 Years : జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకు పాతికేళ్లు.. 13 ఏళ్ల వయసులోనే హీరోగా

అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.