చిరు, చరణ్ కాంబినేషన్లో మలయాళ రీమేక్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. `మగధీర`, `బ్రూస్లీ`, `ఖైదీ నంబర్ 150` చిత్రాల్లో ఇద్దరూ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల ప్రకారం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన చిత్రం `లూసిఫర్`ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారట. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వినపడుతున్న సమాచారం మేరకు ఈ పొలిటికల్ చిత్రం రీమేక్‌లో మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి.. పృథ్వీరాజ్ పాత్రలో చరణ్ నటిస్తారని టాక్.
ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`విడుదలవున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు, కొరటాల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాతే `లూసిఫర్` రీమేక్ తెరకెక్కుతుందని సమాచారం. దాదాపు ఈ సినిమాను వచ్చే ఏడాదే సెట్స్‌కు వెళ్లేలా కనపడుతుంది. అలాగే రామ్‌చరణే ఈ సినిమాను నిర్మించనున్నారని కూడా అర్థమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com