ఇది ఇండస్ట్రీకి గుణపాఠం అంటున్న చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికి కంచె సినిమా బాగా నచ్చేసిందట. సినిమా చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోయాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ కంచె టీమ్ ను అభినందించారు. అంత వరకు బాగానే ఉంది. అయితే కంచె సినిమా గురించి చిరు మాట్లాడుతూ...రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంతో తీసిన కంచె సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కళ్లకుకట్టినట్టు చూపించారు. ఈ సినిమాను 55 రోజుల్లో తీసారంటే ఆశ్చర్యపోయాను. బడ్జెట్ పెరిగిపోయి..నిర్మాణం అనేది హద్దులు లేకుండా ఉన్న ఈరోజుల్లో కేవలం 55 రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే దర్శకుడి ప్రతిభకి గీటురాయి. అలాగే ఇండస్ట్రీకి గుణపాఠం లాంటిది అన్నారు. మరి...ఇప్పటి నుంచైనా చరణ్ సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్త తీసుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com