టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి చిరంజీవి ఫోన్!
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి మెగాస్టార్ గా ఎంత ఎత్తుకు ఎదిగినా తనలోని సేవా దృక్పథాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కరోనాతో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి చిరు ఏదో ఒక విధంగా సేవ కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు చేస్తూనే ఉన్నారు. తన వంతుగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: కోవిడ్ టైంలో చైనా కుట్ర.. సంచలన పాయింట్ తో ఫ్యామిలీ మ్యాన్ 3!
ఇదిలా ఉండగా కరోనా రోగులకు ఆక్సిజన్ ఎంతో కీలకం. ఆక్సిజన్ సకాలంలో అందక చాలా మంది పేషంట్లు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. దీనితో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం ఎంతో కీలకం అని చిరంజీవి భావించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణ జరుగుతోంది. ఇదిలా ఉండగా చిరంజీవి తాజాగా మహబూబాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ ని యోగ క్షేమాలు అడిగారు.
'హలొ శంకర్ ఎలా ఉన్నారు.. కుటుంబ సభ్యులు బావున్నారా.. ప్రజల్లో మీరు బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగా లేవు. ఆరోగ్యం జాగ్రత్త' అని చిరు శంకర్ తో అన్నారు. మానుకోట నా అభిమానుల కోట అని చిరంజీవి అన్నారు. మహబూబాబాద్ లో ఆక్సిజన్ కొరత రాకూడదని మీ మాట కోసం ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చినట్లు చిరంజీవి శంకర్ తో అన్నారు.
దీనితో శంకర్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.మేము అడిగిన వెంటనే ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసినందుకు ప్రజల తరుపున కృతజ్ఞతలు అని శంకర్ మెగాస్టార్ తో అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com