గొల్లపూడి గురించి మాట్లాడుతూ చిరు కంటతడి!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా.. రేపు అనగా ఆదివారం నాడు చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన్ను కడసారి చూసేందుకు నటీనటులు చెన్నైకి చేరుకున్నారు. మరోవైపు చెన్నైలోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి సందర్శకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి.. గొల్లపూడి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. గొల్లపూడితో తనకున్న అనుబంధాన్ని పంచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

నేను అస్సలు ఊహించలేదు!

‘గొల్లపూడితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 1989లో మేమిద్దరం పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ మా అనుబంధం కొనసాగింది. గొల్లపూడి వద్ద కొన్ని వారాల పాటు శిష్యరికం చేశాను. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రంలో గొల్లపూడితో కలిసి నటించాను. తన కుమారుడు శ్రీనివాస్ పేరిట అవార్డు ఇస్తూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అప్పుడే ఆయన్ను చివరిసారిగా చూశాను. ఇప్పుడిలా ఆయన నివాసానికి వచ్చి పార్థివదేహాన్ని చూడాల్సిన దురదృష్ట పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు’ అని చిరంజీవి చెబుతూ ఒకింత కంటతడిపెట్టారు.

More News

ఫ్యాన్స్.. పవన్ చెప్పిందే నిజమని నమ్మితే..: రవితేజ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఊహించని రీతిలో భారీ షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. పవన్‌ అత్యంత సన్నిహితుడు.. పవన్ కు రైట్ హ్యాండ్ అనే రీతిలో పార్టీ వర్గాల్లో రాజు రవితేజకు గుర్తింపు ఉంది.

నన్ను అవమానించాడు.. 'అమ్మరాజ్యం' ప్లాప్: పాల్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అనేక వివాదాలు.. మరెన్నీ కోర్టు చీత్కారల నడుమ ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకున్న సంగతి తెలిసిందే.

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు...: రాపాక సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. ఆ పార్టీ తరఫున పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.

అయేషా తల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దీంతో విచారణ మరింత వేగవంతమైంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు

అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి