అలీకి మాతృ వియోగం.. చిరు, పవన్ ల పరామర్శ
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్య నటుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో రాజమహేంద్ర వరంలో చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. కాగా.. హైదరాబాద్ లోని అలీ నివాసానికి చేరుకున్న మెగా స్టార్ చిరంజీవి... బీబీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలీతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు చిరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
కాగా... అలీ తల్లి మరణవార్త విన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీబీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అలీకి తల్లితో ఉన్న అనుబంధం బలమైందని తనకు తెలుసన్నారు పవన్. అలీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే మంచి స్నేహితులుగా కొనసాగిన పవన్, చిరులు ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిన విషయం తెలిసిందే. అలీ వైసీపీలో చేరడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ మిత్రుడు వెన్నుపోటు పొడిచాడంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
శ్రీ ఆలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి - @PawanKalyan pic.twitter.com/1COQXaOqBQ
— JanaSena Party (@JanaSenaParty) December 19, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments