అలీకి మాతృ వియోగం.. చిరు, పవన్ ల పరామర్శ

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

హాస్య నటుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో రాజమహేంద్ర వరంలో చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. కాగా.. హైదరాబాద్ లోని అలీ నివాసానికి చేరుకున్న మెగా స్టార్ చిరంజీవి... బీబీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలీతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు చిరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

కాగా... అలీ తల్లి మరణవార్త విన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీబీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అలీకి తల్లితో ఉన్న అనుబంధం బలమైందని తనకు తెలుసన్నారు పవన్. అలీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే మంచి స్నేహితులుగా కొనసాగిన పవన్, చిరులు ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిన విషయం తెలిసిందే. అలీ వైసీపీలో చేరడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ మిత్రుడు వెన్నుపోటు పొడిచాడంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

More News

కెమెరాతో ప్రకృతిలో ప్రయాణం ... వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా చెర్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.... మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చెర్రీ..

సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ గెస్ట్ గా చిరు...?

సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగేందుకు రె"ఢీ" అవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది సినిమాలు బరిలో ఉన్నా..

బాల‌య్య మాట నిల‌బెట్టుకుంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం `రూల‌ర్‌`. క్రిస్మ‌స్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌లవుతుంది.

వెంకీ మామ అదుర్స్ అన్న మెగాస్టార్... మామకు తగ్గ అల్లుడు చైతు అంటూ ప్రశంస

వెంకీ మామ... డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేష్,

హాస్యనటుడు అలీకి మాతృవియోగం

ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృవియోగం కలిగింది. అలీ తల్లి జైతన్ బీబీ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.