చిరు మూవీ ప్రారంభోత్స‌వం - ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి కార‌ణం..?

  • IndiaGlitz, [Friday,April 29 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్ర ప్రారంభోత్స‌వం ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో ఓ పండ‌గ‌లా జ‌రిగింది. ఈ వేడుక‌కు దాదాపు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ వ‌చ్చారు. కానీ ముఖ్య‌మైన వ్య‌క్తి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం రాలేదు. త‌మ్ముడు ప‌వ‌న్ కోసం అన్న‌య్య చిరంజీవి స‌ర్ధార్ సెట్స్ కి వెళ్ళి సంద‌డి చేసారు. ఆత‌ర్వాత స‌ర్ధార్ ఆడియో వేడుక‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో రిలీజ్ చేసారు. అంతే కాకుండా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చిరంజీవి మాట్లాడుతూ...గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా టి.వీలో వ‌స్తే...అలా చూస్తుండిపోతాను. అంత‌లా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా నా మ‌న‌సుని హ‌త్తుకుంది. క‌ళ్యాణ్ సినిమాలు మానేస్తాని అంటున్న‌ట్టు పేప‌ర్లో చ‌దివాను. ద‌య‌చేసి న‌ట‌న‌కు గుడ్ బై చెప్ప‌ద్దు..అటు రాజ‌కీయాలు ఇటు సినిమాలు రెండింటిలో రాణించ గ‌ల స‌త్తా నీ సొంతం అంటూ త‌మ్ముడు ప‌వ‌న్ ని ఆకాశానికి ఎత్తేశాడు అన్న‌య్య చిరంజీవి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..స్థిత‌ప్ర‌జ్ఞ‌త గ‌ల వ్య‌క్తి క‌దా..అందుకే అన్న‌య్య పొగిడాడ‌ని పొంగిపోలేదు...అన్న‌య్య పై కోపంతో కృంగిపోలేదు. త‌న ప‌ని త‌న‌దే..ఆయ‌నదో ప్ర‌పంచం...అది కొంత మందికి కొత్త‌గా...మ‌రి కొంత మందికి వింత‌గా ఉంటుంది. అన్న‌య్య ద్వితీయ కుమార్తె శ్రీజ పెళ్లికి కూడా ప‌వ‌న్ హాజ‌రు కాలేదు. రిసెప్ష‌న్ కి కూడా హాజ‌రు కాలేదు. అప్పుడంటే... స‌ర్ధార్ రిలీజ్ హాడావిడిలో ఉన్నాడు కాబ‌ట్టి రాలేదు స‌రే...మ‌రి ఇప్పుడు ఎందుకు రాలేదు..? ఓ వైపు అన్న‌య్య రీ ఎంట్రీ..! మ‌రో వైపు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ఎంట్రీ..! ఇంత క‌న్నా ప్ర‌త్యేక‌త ఏమి కావాలి..? పవ‌న్ బిజీగా ఉన్నార‌నుకుంటే...ఆయ‌న తాజా చిత్రం షూటింగ్ జూన్ లో ప్రారంభం. ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్నారు. అయినా....అన్న‌య్య కోసం త‌మ్ముడు ఎందుకు రాలేదు..? ప‌వ‌న్ ఫామ్ హౌస్ లో ఫార్మ‌ర్ గా త‌న‌కు బాగా ఇష్ట‌మైన వ్య‌వ‌సాయం చేస్తున్నారు అనుకుంట‌...అదీ కాకుండా సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ నుంచి అలా కారులో కూర్చొని రావ‌డం అంటే ప‌వ‌న్ కి కాస్త క‌ష్టంగా ఉంటుందేమో..? లేక బిజీగా ఉన్నారో...? కార‌ణం ఏదైతేనే....అత్యంత ముఖ్య‌మైన చిరు 150వ చిత్ర ప్రారంభోత్స‌వంకు ప‌వ‌న్ రాలేదు. ప‌వ‌న్ శైలే వేరు...ఆయ‌న ప్ర‌పంచ‌మే వేరు..