'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు. అయితే సినిమా రీమేక్ సరే.. నిర్మాత సరే తెరకెక్కించే దర్శకుడు ఎవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. అంతే కాదు.. అసలు సినిమా రీమేక్ ఉందా లేదా..? ఒక వేళ రీమేక్ చేస్తే చిరంజీవే నటిస్తారా లేకుంటే పవన్ కల్యాణ్ నటిస్తారా..? లేదా ఇద్దరూ కలిసి నటిస్తారా..? ఇలా అనే రకాలు పుకార్లు షికార్లు చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సుకుమార్, వివి వినాయక్, సురేంద్రారెడ్డి, శ్రీను వైట్ల ఇలా చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.

త్వరలోనే చెబుతా..

అయితే.. ఈ సినిమాలో తాను నటిస్తున్నానా..? లేదా..? అనేదానిపై తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఎస్.. కొరటాల శివ సినిమా తర్వాత 153 సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్‌లో చేస్తున్నాను. ప్రస్తుతం దర్శకుడి కోసం వెయిటింగ్‌లో ఉన్నాం. ఇంకా దర్శకుడు ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. నలుగురైదురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయ్. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాం’ అని చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

పవన్ చేస్తానంటే ఇచ్చేస్తా..

రీమేక్ సినిమా తానే చేయాలని అనుకుంటున్నానని.. ఒకవేళ తమ్ముడు పవన్ కల్యాణ్ చేయాలనుకుంటే మాత్రం తప్పుకుంటానని చిరు తన మనసులోని మాటను చెప్పేశారు. అయితే పవన్ ఈ సినిమా చేస్తానన్న విషయం ఇంతవరకూ తన దాకా రాలేదని.. ఈ సినిమా వీలైనంతవరకూ నేనే చేస్తానని చిరు క్లారిటీగా చెప్పారు.

పవన్ కష్టమే..

మొత్తానికి చూస్తే.. లూసీఫర్ రీమేక్‌పై కూడా చిరు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మిగిలిందల్లా పవన్ రియాక్షన్ మాత్రమే. మరి తమ్ముడు చేస్తాడా లేకుంటే అన్నయ్యకే వదిలేస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది. మరి పవన్ ఎప్పుడు పెదవి విప్పుతాడో ఏంటో మరి. వాస్తవానికి పవన్‌కు ఇప్పుడు వరుస సినిమాలున్నాయ్.. ఇంకా కొంతమంది దర్శకులు ఆయనకోసం వెయిటింగ్‌లో ఉన్నారు. పవన్ ఈ సినిమా దాదాపు టచ్ చేయకపోవచ్చు.