దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: మెగాస్టార్ చిరంజీవి
Tuesday, April 25, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కళాతపస్వీ కె. విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడని కాకుండా కుటంబ పరంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది.
మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నా. అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సింది. కానీ కాస్త ఆలస్యమైన అవార్డు ఆయన్ను వరించడం సంతోషంగా ఉంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావడం తో ఆ అవార్డుకు నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాబివందనాలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషినే..ఆయన చిరంజీవినే` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments