ఆ వార్తల్లో వాస్తవం లేదంటున్న చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి బి.జె.పి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోఅయితే చిరు బి.జె.పి కి దగ్గరవుతున్నాడని...ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సి.ఎం అభ్యర్ధిగా చిరంజీవిని బి.జె.పి ప్రకటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ బి.జె.పి కి మద్దతు ఇస్తుండడం...ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసిన తర్వాత కాస్త దూరంగా ఉంటున్న చిరు, పవన్ ఈమధ్య సన్నిహితంగా ఉండడంతో ఈవార్తలు నిజమేమో అనిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల గురించి చిరంజీవి స్పందిస్తూ....నేను బి.జె.పి లో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఆధారం లేకుండా వస్తున్న వార్తలు అవి. ఈ వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అంటూ స్పష్టం చేసారు. మరి..చిరు మాట మీద నిలబడి రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా..? లేక మాట మార్చి బి.జె.పి లో చేరతారో కాలమే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout