న్యూలుక్ తో సర్ ఫ్రైజ్ చేస్తున్న చిరు..

  • IndiaGlitz, [Tuesday,January 19 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి..డైరెక్ట‌ర్ వినాయ‌క్, నిర్మాత చ‌ర‌ణ్, క‌త్తి రీమేక్...అంటూ.. గ‌త కొన్నిరోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇటీవ‌ల డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తూర్పుగోదావ‌రి జిల్లా పాశ‌ర్ల‌పూడిలో ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ చిరు 150వ సినిమా పై మార్చికి క్లారిటి వ‌స్తుంద‌ని చెప్పారు. దీంతో మార్చి 27న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కానుక‌గా చిరు 150వ సినిమా ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం ప్రారంభం అయ్యింది.
ఇదిలా ఉంటే..తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి మీసం మేలేసిన‌ట్టుగా క‌నిపించే న్యూలుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌ర్నీ స‌ర్ ఫ్రైజ్ చేసారు. క‌త్తి లా క‌నిపిస్తున్న చిరు మీస‌క‌ట్టు క‌త్తి రీమేక్ కోసమే అంటున్నారు. మ‌రి...ఈ విష‌యం పై చిరు స్పందిస్తాడేమో చూడాలి.