చిరంజీవి కొత్త అవతారం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌ను రీసెంట్‌గా చూసిన చిరంజీవి సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్ వేసే సన్నివేశాలను తొలగించమని చెప్పారట.
ఎందుకంటే, తాను పోషిస్తున్నది ఫ్రీడమ్ ఫైటర్ కథ కాబట్టి, ఆ పాటలో తను డ్యాన్స్ వేసినట్టు ఉండటం బాగోదని ఆయన భావించాడట. అలాగే కొన్ని చిన్న చిన్న మార్పులను కూడా సూచించారట. ఇప్పుడు సురేందర్ రెడ్డి అండ్ టీం ఈ మార్పులు చేర్పులు చేయడంలో బిజీ బిజీగా ఉందట. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments