జగన్‌తో భేటీకి చార్టడ్ ఫ్లైట్‌లో చిరు, నాగ్, జక్కన్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ భేటీ కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్‌ జగన్‌తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా.. ఇప్పటికే చార్టడ్ ఫ్లైట్‌లో సినీ పెద్దలు పయనమయ్యారు. మరికొద్దీ సేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సినీ ప్రముఖులు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి అలియాస్ జక్కన్నలు ఫ్లైట్‌లో పయనమయ్యారు. దగ్గుబాటి సురేష్‌బాబు, దిల్‌రాజు, దామోద‌ర్ ప్రసాద్‌తో పాటు మరికొందరు పెద్దలు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకోనున్నారు. వీరంతా గన్నవరం విమానాశ్రయం వద్ద కలుసుకోనున్నారు.

అక్కడ్నుంచి నేరుగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌కు చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం వరకు బస చేసి నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్‌ను చిరు అండ్ టీమ్ కలవనుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జ‌గ‌న్‌కు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ తరఫున ధన్యవాదాలు చెప్పనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవి సీరియల్స్ నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే ఏపీలో స్టూడియోల ఏర్పాటు, సినీ పరిశ్రమ తరలింపు విషయంపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు షూటింగ్స్‌కు విధి విధానాలు ఏర్పాటు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

More News

కేసీఆర్, తలసానికి థ్యాంక్స్ చెప్పిన చిరు

టాలీవుడ్ సినిమా, టీవీ, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ సర్కార్.. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

చిరు సూచనతో ‘ఆచార్య’లో మార్పులు, చేర్పులు..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. అంతేకాదు.. బహుశా ఆయా రంగాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో..

బాలయ్య బర్త్ డేపై బ్రాహ్మణి ఎమోషనల్ మెసేజ్..

టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న పుట్టిన రోజు. ఈ పదో తారీఖుతో బాలయ్య 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

కరోనా దయవల్ల హ్యాపీగా ఉన్నా..: ఆర్జీవీ

ఇదేంటి టైటిల్ చూడగానే.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. లోకమంతా భయంతో వణికిపోతుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఉండటమేంటి..?

తెలంగాణలో ‘పది’ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక..