చిరు - నాగ్ తర్వాతే బాలయ్య..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున తర్వాతే నటసింహం బాలయ్య. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే కవర్ పేజీ పై బాలయ్య లెజండరీ పోస్టర్ వచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 3 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కూడా హాజరు కానున్నారు. ఈ స్పెషల్ బుక్ పై బాలయ్య లెజెండ్ సినిమాలో స్టిల్ ముద్రించి ది లెజెండ్ అని టైటిల్ పెట్టారు. అంతే కాకుండా తన తరం హీరోల్లో ఏకైక ఆల్ రౌండర్. తండ్రికి తగ్గ తనయుడుగా సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న అనితరసాధ్యుడు అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
బాలయ్య త్వరలో వందో సినిమా చేయబోతున్న సందర్భంలో ఇండియా టుడే ఈ స్పెషల్ బుక్ ను తీసుకువచ్చింది. అయితే ఇండియా టుడే చిరంజీవి - నాగార్జున లపై స్పెషల్ ఎడిషన్ ను ఎప్పుడో తీసుకువచ్చింది. చిరు - నాగ్ తర్వాత బాలయ్య పై ఇప్పుడు ఇండియా టుడే స్పెషల్ ఎడిషన్ తీసుకువచ్చింది. అయితే ఇండియా టుడే తెలుగు మ్యాగజైన్ మూతపడినప్పటికీ బాలయ్య కోసం స్పెషల్ ఎడిషన్ తీసుకురావడం విశేషం. ఈ స్పెషల్ ఎడిషన్ నందమూరి అభిమానులకు అరుదైన కానుక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments