చిరు- నాగ్ - సచిన్ లుంగీ డ్యాన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కేరళ బ్లాష్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్, చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ సహ యజమానులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేరళ బ్లాష్టర్స్ జట్టు మూడో సీజన్ కు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా తమ టీమ్ ను ఎనౌన్స్ చేసేందుకు ప్లేయర్స్ & ఓనర్స్ అంతా ఒక చోటకి చేరారు. సచిన్, చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ, అల్లు అరవింద్ అంతా తెల్ల లుంగీ, పుసుపు టీ షార్ట్ తో దర్శనమిచ్చి ఫోటోలో చూపించిన విధంగా లుంగీ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఫోజు ఇచ్చారు.
ఇదిలా ఉంటే... ఈ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ నవిన్ పౌలీ. ఇంతకీ నవిన్ పౌలి ఎవరనుకుంటున్నారా..? ప్రేమమ్ లో చైతు నటిస్తున్నాడు కదా. ఈ ప్రేమమ్ ఓరిజినల్ మూవీలో హీరోగా నటించింది నవిన్ పౌలినే. ఈ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడం పట్ల నవిన్ పౌలి స్పందిస్తూ...లెజండరీ ఏక్టర్స్ చిరంజీవి, నాగార్జున లతో అసోసియేట్ అవ్వడంతో ఎక్సైట్ మెంట్ డబుల్ అయ్యింది అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com