చిరంజీవి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్....

  • IndiaGlitz, [Sunday,January 22 2017]

ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అదిరింది. బాహుబ‌లి మిన‌హా తొలిసారి వంద‌కోట్ల షేర్ సాధించే దిశ‌గా అడుగులేస్తూ ముందు కెళ్తున్న చిరంజీవి త‌దుప‌రి సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. చిరంజీవి 151వ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట‌య్యాయి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరు సినిమా చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎవ‌రినీ తీసుకుంటే బావుంద‌నే దానిపై పెద్ద చ‌ర్చ‌లే జ‌రిగాయ‌ట‌.

చిరు అండ్ టీం యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిప్ హాప్ త‌మిళను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకునే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని స‌మాచారం. రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్ ధృవ సినిమాకు సూప‌ర్బ్ మ్యూజిక్ అందించి మంచి మార్కుల‌ను సంపాదించాడు హిప్ హాప్ త‌మిళ‌. చిరు 151వ సినిమాను కూడా రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు.

More News

రవితేజ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.....

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ సినిమా చేయడానికి ఏడాదికి పైగానే సమయం తీసుకున్నాడు.

సరికొత్త రికార్డులు దిశగా చిరు....

గ్యాప్ వస్తే వచ్చింది కానీ మెగాస్టార్ మాత్రం హీరోగా మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు.

మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన రామ్ చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్ధానం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మెగా చిరంజీవితం 150 అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించి తొలి పుస్త‌కాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కి అంద‌చేసారు.

జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకం - పవన్ కళ్యాణ్..!

జల్లికట్టు పై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఇది సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం.

ప్ర‌భాస్ మ్యారేజ్ డీటైల్స్ చెప్పిన కృష్ణంరాజు..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే...తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి వివ‌రాల‌ను రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మీడియాకి తెలియ‌చేసారు.