చ‌ర‌ణ్ న‌టించిన సంస్థ‌లో చిరు మూవీ?

  • IndiaGlitz, [Friday,April 13 2018]

మెగాస్టార్ చిరంజీవి.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లో సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. ఓ సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం చిరు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా పూర్తైన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రంలో చిరు నటిస్తున్నారని తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసిన సుకుమార్.. చిరు చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

తాజాగా సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో విడుదలైన 'రంగస్థలం' జైత్ర‌యాత్ర‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా చిరు, సుకుమార్ కలయికలో సినిమా రాబోతున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలను.. ఇటీవల సుకుమార్ ఖండించారు.

కాగా.. ఈ నేపథ్యంలో ఇప్పుడొస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వ‌ర‌లోనే చిరు, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌పై క్లారిటీ వ‌స్తుంది. 

More News

దేవ‌దాసు లుక్‌లో నాగ‌చైత‌న్య‌

భగ్న ప్రేమికుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది దేవదాసు. అటువంటి దేవదాసు పేరు వినగానే సినీ ప్రియుల మదిలో మెదిలే నటుడు అక్కినేని నాగేశ్వరరావు.  

'నా పేరు సూర్య' చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా

ఆ సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి: 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' నిర్మాత రామ్మోహనరావు

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో  హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా

రంగస్దలం సెట్లొ 'సంత' ఫస్ట్ లుక్ లాంఛ్ చెసిన సుకుమార్

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత".

స‌మంత‌ని ప్రేమించే పాత్ర‌లో..

మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.