స‌ర్ధార్ సెట్ లో మెగాస్టార్

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరిద్ద‌రికి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాకా...బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే బ్రూస్ లీ సినిమాలో చిరు న‌టించ‌డం...బ్రూస్ లీ రిలీజ్ త‌ర్వాత ప‌వ‌న్ చిరు ఇంటికి వెళ్లి అభినందించ‌డంతో వీరిద్ద‌రు మ‌ళ్లీ ఒక‌ట‌య్యారు అనిపించింది. అలాగే చ‌ర‌ణ్ కూడా స‌ర్ధార్ సెట్స్ కి వెళ్లి బాబాయ్ ప‌వ‌న్ ని క‌లిసారు.

ఇక ఇప్పుడు చిరంజీవి స‌ర్ధార్ షూటింగ్ సెట్స్ కి వెళ్లి త‌మ్ముడు ప‌వ‌న్ ని క‌లవ‌డంతో పాటు స‌ర్ధార్ సెట్ లో సంద‌డి చేసార‌ట‌. అలాగే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియోకి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.