మెగాస్టార్ 'మాస్టర్' కి 20 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్లర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కి సక్సెస్‌ఫుల్‌గా శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవికి.. వెనువెంటనే దక్కిన మరో సూపర్ సక్సెస్ మూవీ మాస్టర్. తెలుగు లెక్చరర్‌గా చిరు నటించిన ఈ సినిమాకి తొలుత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో చిరు లుక్, స్టైల్, డాన్స్‌లు ఆ టాక్ని అధిగమించి సూపర్ హిట్ వైపు నడిపించాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.
సాక్షిశివానంద్తో పాటు నగ్మా సోదరి రోషిణి ఇందులో మరో హీరోయిన్గా నటించింది. దేవా సంగీతంలోని పాటలన్నీ సూపర్‌హిట్టే. ముఖ్యంగా చిరు తొలిసారిగా పాడిన తమ్ముడు అరె తమ్ముడు పాట అయితే ఓ ఊపు ఊపింది. అలాగే చిరు, రోషిణిలపై చిత్రీకరించిన తిలోత్తమా మంచి మెలోడీగా నిలిచింది. తెలుగులో తొలి డి.టి.ఎస్ చిత్రమైన మాస్టర్.. 1997లో అక్టోబర్ 3న విడుదలైంది. అంటే.. నేటితో ఈ సినిమా 20 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments