ప్రభుదేవని బాధపెట్టిన చిరంజీవి..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ నటించిన తాజా చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని విజయ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళ్ లో ప్రభుదేవ నిర్మిస్తుండడం విశేషం. దసరా కానుకగా అభినేత్రి చిత్రాన్న అక్టోబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుదేవ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ లో ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ అందరూ చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఇటీవల బన్ని టాపులేచిపొద్ది సాంగ్, చరణ్ మెగా మెగా మీటర్ సాంగ్, ఎన్టీఆర్ ఫాలో ఫాలో సాంగ్స్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది అని తెలిపారు. చిరంజీవి 150వ సినిమాకి కొరియోగ్రఫీ చేయమని అడిగారా అన్న ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి గారి 150వ సినిమాకి కొరియోగ్రఫీ చేయమని నన్ను ఎవరు అడగలేదు అడిగితే చేసేవాడిని అనేలా సమాధానం చెప్పారు. ప్రభుదేవ తన మనసులో మాట చెప్పాడు. మరి...ఇప్పుడైనా చిరు ప్రభుదేవని పిలిచి కొరియోగ్రఫీ చేయమంటారేమే చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com