కేర‌ళ‌కు చిరు, మ‌హేశ్ చేయూత‌...

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

వ‌ర‌ద‌ల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రంలో అపార అస్థి న‌ష్ట‌మే కాకుండా.. ప్రాణ న‌ష్టం కూడా జ‌రుగుతుంది. ప్ర‌జ‌లు క‌నీస అవ‌స‌రాలు అందక అల్లాడుతున్నారు. మ‌ల‌యాళీల కోసం దేశ‌మంతా స్పందిస్తుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా త‌మ వంతుగా స్పందిస్తున్నారు.

ఇందులో చిరు కుటుంబంలో చిరంజీవి 25 ల‌క్ష‌లు, రామ్‌చ‌ర‌ణ్ 25 లక్ష‌లు రూపాయ‌లు, చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి ల‌క్ష రూపాయ‌ల మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా సీఎం స‌హాయనిధికి పంపారు. అంతే కాకుండా ఉపాస‌న ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే మెడిసిన్‌, ప‌రిశుభ్ర‌త వ‌స్తువుల‌ను పంపారు. మ‌హేశ్‌బాబు త‌న వంతు పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.