చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
బంధాలు, బాంధవ్యాల విలువల్ని చెప్తూనే, అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన చిత్రం మగధీరుడు`. చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. చిరంజీవి పూర్తి స్థాయి హీరోగా ఎదిగిన తర్వాత జయసుధ హీరోయిన్‌గా చేసిన ఏకైక చిత్రం ఇదే. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, రోజా రమణి, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా ఈ కుటుంబకథా చిత్రాన్ని విజయబాపినీడు తెరకెక్కించారు.
ఇక కథ విషయానికొస్తే.. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మంచి స్నేహితులు. సత్యనారాయణకు ముగ్గురు పిల్లలు. మూర్తి, చంద్రం, కళ్యాణ్. మూర్తి అమాయకుడు, విప్లవ భావాలు కలవాడు. చంద్రం తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ కు అన్నలన్నా, కుటుంబం అన్నా ప్రాణం. తన పిల్లలు ఎప్పటికి కలిసే ఉండాలని సత్యనారాయణ ఆశిస్తూ ఉంటాడు. కాని కొన్ని పరిస్థితుల వల్ల కొడుకులు విడిపోతారు. దీంతో గుండె పోటుతో సత్యనారాయణ చనిపోతాడు. కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుంది. కొన్ని సంఘటనల తర్వాత అనుబంధంలో ఉండే తీయదనాన్ని తెలుసుకుని అంతా ఒకటవుతారు. కథ సుఖాంతం అవుతుంది.
సినిమాలో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మధ్య వచ్చే స్నేహ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక బాలసుబ్రహ్మణ్యం అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్. పాటలలో “ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం” అనే పాట కుటుంబ అనుబంధాలను తెలియజేస్తుంది. మార్చి 7, 1986 విడుదలైన ఈ చిత్రం.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments