చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

బంధాలు, బాంధవ్యాల విలువ‌ల్ని చెప్తూనే, అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన‌ చిత్రం మగధీరుడు'. చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. చిరంజీవి పూర్తి స్థాయి హీరోగా ఎదిగిన తర్వాత జయసుధ హీరోయిన్‌గా చేసిన ఏకైక చిత్రం ఇదే. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, రోజా రమణి, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా ఈ కుటుంబకథా చిత్రాన్ని విజయబాపినీడు తెరకెక్కించారు.

ఇక కథ విషయానికొస్తే.. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మంచి స్నేహితులు. సత్యనారాయణకు ముగ్గురు పిల్లలు. మూర్తి, చంద్రం, కళ్యాణ్. మూర్తి అమాయకుడు, విప్లవ భావాలు కలవాడు. చంద్రం తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ కు అన్నలన్నా, కుటుంబం అన్నా ప్రాణం. తన పిల్లలు ఎప్పటికి కలిసే ఉండాలని సత్యనారాయణ ఆశిస్తూ ఉంటాడు. కాని కొన్ని పరిస్థితుల వల్ల కొడుకులు విడిపోతారు. దీంతో గుండె పోటుతో సత్యనారాయణ చనిపోతాడు. కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుంది. కొన్ని సంఘ‌ట‌న‌ల‌ తర్వాత అనుబంధంలో ఉండే తీయదనాన్ని తెలుసుకుని అంతా ఒకటవుతారు. కథ సుఖాంతం అవుతుంది.

సినిమాలో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మధ్య వచ్చే స్నేహ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక బాలసుబ్రహ్మణ్యం అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్. పాటలలో “ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం” అనే పాట కుటుంబ అనుబంధాలను తెలియజేస్తుంది. మార్చి 7, 1986 విడుదలైన‌ ఈ చిత్రం.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

More News

'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా(సూర్య 36)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

శర్వాకి చిరు సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చేనా?

ఇప్పటి తెలుగు హీరోలకి 90వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం పరిపాటైపోయింది.

'భరత్ అనే నేను' టీజర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

మార్చి 8న 'అభిమన్యుడు' మొదటి పాట

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నారు.

'ఏ మంత్రం వేసావె' తో విజయ్ దేవరకొండ అంచనాలను అందుకుంటాడు - నిర్మాత మల్కాపురం శివకుమార్

పెళ్లిచూపులు అర్జున్రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ను సంపాందించుకున్నాడు.