మ‌రోసారి అలాంటి టైటిల్‌తో మెగాస్టార్..!

వీలైనంత త్వ‌ర‌గా ఆచార్య సినిమాను పూర్తి చేసి లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌. అందుకోసం దీనికి సంబంధించిన వర్క్ స్పీడ్ అప్ చేసింది మెగా క్యాంప్. ఈ సినిమా రీమేక్‌ను డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా తెర‌కెక్కించ‌నున్నాడు. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో మ‌రోసారి రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌ను చూపించ‌నున్నార‌ట‌. అంటే ఇది వ‌ర‌కు చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇంద్ర.. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగింది. కాగా.. లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి పేరు బైరెడ్డి అని అందుక‌నే.. ఈ సినిమాకు బైరెడ్డి అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళం లూసిఫ‌ర్ స్టైల్లోనే ఈ సినిమాలోనూ చిరంజీవికి ఎలాంటి పాట‌లు ఉండ‌వ‌ని కూడా స‌మాచారం.

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ నేపథ్యంలో పునః ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆచార్యలో చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నక్సలైట్ నాయకుడిగా ఆకట్టుకోనున్నారు. దేవాదాయ శాఖలోని అవినీతిని ప్రశ్నించే కోణంలో ఆచార్య సినిమాను తగినంత కమర్షియల్ అంశాలతో కొరటాల తెరకెక్కిస్తున్నారు.

More News

బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో సినిమా.. ఓకే అంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఓ సినిమాను చేయాల‌ని అనుకున్నాడు.

కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైంది.. టీపీసీసీ అధ్యక్షుడిగా...

ఒకప్పుడు తెలంగాణను ఏలిన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతోంది. వరుస వైఫల్యాలు ఈ పార్టీ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి.

బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మహేష్!?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం తుది అంకానికి చేరువవుతోంది.

రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘కథ మొదలైంది’

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై దారుణంగా పడనుందా? కౌంటింగ్ ముగిసిన గంటల్లోనే అనూహ్య పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ వేదికవుతోందా?