చిరు `లూసిఫర్` రీమేక్‌ను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ స్థానంలో మహేశ్ నటించడం దాదాపు ఖాయమైంది. ఈ సినిమాను ఆగస్ట్‌లో విడులద చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా.. ఆగస్ట్ తర్వాత చిరు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 153వ సినిమాను చేయబోతున్నాడట. మలయాళంలో మోహన్‌లాల్ టైటిల్ పాత్రలో నటించిన `లూసిఫర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కాగా.. తెలుగులో రామ్‌చరణ్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సుకుమార్ సిద్ధం చేశాడు. సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు బన్నీ సినిమాతో సుకుమార్ బిజీగా ఉన్నాడు.
దీంతో `లూసిఫర్` రీమేక్‌ను ఎవరు తెరకెక్కిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వినాయక్ హీరోగా స్టార్ట్ అయిన శీనయ్య కూడా ఆగిపోవడంతో ఇప్పుడు వినాయక్ ఖాలీగానే ఉన్నాడు. కాబట్టి ఆయన డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి లూసిఫర్‌లో పృథ్వీరాజ్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తాడా లేక మరేవరైనా నటిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments