గ‌న్ ఫైరింగ్ నేర్చుకుంటున్న చిరు..

  • IndiaGlitz, [Monday,November 05 2018]

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న యూనిట్ హైద‌రాబాద్‌లో షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిరంజీవి గ‌న్ ఫైరింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. 2012లో ఓలింపిక్స్ కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్న గ‌గ‌న్ నారంగ్ అకాడ‌మీలో చిరు శిక్ష‌ణ తీసుకుంటున్నారు.

అందుకోస‌మ‌ని గ‌గ‌న్ నారంగ్‌ను చిరంజీవి రీసెంట్‌గా కలిశారు. చిరుకి గంట‌కు పైగా గ‌న్ ఫైరింగ్‌లో మెళ‌కువ‌ల‌ను నేర్పించాడ‌ట గ‌గ‌న్. ఇద్ద‌రూ క‌లిసి ఉన్నఫోటోను గ‌గ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, నిహారికా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌.

More News

శోభన్‌బాబు అవార్డుల వేడుక దిగ్విజయానికి కృషి చేస్తాం: పరుచూరి బ్రదర్స్

ప్రముఖ కథానాయకుడు శోభన్‌బాబు పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతోంది అఖిల భారత శోభన్‌ బాబు సేవాసమితి.

వెయ్యి కోట్ల‌తో సినిమా తీస్తా - సుభాష్ క‌ర‌ణ్‌

ప్ర‌స్తుతం '2.0' ఫీవ‌ర్ కొన‌సాగుతుంది. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

డిస్కో డాన్స‌ర్ పాత్ర‌లో ర‌వితేజ‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్నారు.

'టాక్సీవాలా' మ‌రో రోజు ఆల‌స్యంగా...

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.కె.ఎన్ నిర్మించిన చిత్రం 'టాక్సీ వాలా'.

విక్ర‌మ్‌కుమార్‌తో నాని?

'13బి, మ‌నం, ఇష్క్‌, 24, హ‌లో' వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ త్వ‌ర‌లోనే నేచ‌ర‌ల్ స్టార్ నానితో సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.