ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ట్వీట్.. జగన్ పై ప్రశంసలు
- IndiaGlitz, [Tuesday,June 22 2021]
మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి చిరంజీవి ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13.72 లక్షల మంది ప్రజలకు ఒక్కరోజులోనే వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం సాధించిన ఈ రికార్డ్ పై పలు వార్తలు వచ్చాయి.
ఇదీ చదవండి: తండ్రి వయసున్న వ్యక్తితో ఎఫైర్, చైల్డ్ కూడా ? హీరోయిన్ పై షాకింగ్ రూమర్స్
తాజాగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ పై చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించడం సంతోషించదగ్గ విషయం. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు కోవిడ్ ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. ఆదర్శవంతమైన లీడర్ షిప్ ఇస్తున్న జగన్ గారికి కంగ్రాట్స్. మీకు మరింత శక్తి చేకూరాలి' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చిరంజీవి ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో చిరంజీవి, సురేఖ దంపతులు జగన్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా కరోనా సోకినా పేషంట్లని ఆదుకునేందుకు చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. కరోనా కష్ట సమయంలో చిరంజీవి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్. రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ కానుంది.
So happy at the fabulous feat of vaccinating over 13.72 lac people in a single day by Health teams in #AndhraPradesh.Your efforts fill confidence in everyone about defeating the Covid monster! Way to go TeamAP. More Power to You!Congrats to Sri @ysjagan for inspiring leadership.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 22, 2021