అలవోకగా నా కెమెరా కంటికి చిక్కింది : చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా గడిపేస్తున్నారు. రకరకాల పిక్స్, వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ సినిమాల షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కాలేదు.
తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ ఒక పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ పిక్ కారణంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఫోటోగ్రఫీపై ఉన్న ప్యాషన్. తన ఇంట్లో అందంగా విరబూసిన మందారాలను తన కెమెరాతో క్లిక్ అనిపించారు. అయితే ఈ పిక్‌ను తీయడంలో క్రియేటివిటీని చిరు చూపించారు. మందార మొక్క నిండా పువ్వులు, మొగ్గలతో నిండి ఉన్న ఆ మొక్క చివర సూర్యుడే ఒక ఫ్లవర్‌లా కనిపించేలా ఫోటోని చిరు తీశారు. దీనికి ఒక అందమైన క్యాప్షన్‌ను కూడా ఇచ్చారు.
"ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది .. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది!" అంటూ మెగాస్టార్ ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. షేర్ చేసి అరగంట కూడా కాకముందే భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటి పనుల తాలుకు వీడియోలను.. వంట చేసిన వీడియోలతో పాటు.. తన మనవరాలితో సరదాగా గడిపిన క్షణాల తాలుకు వీడియోలను చిరంజీవి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com