‘ఆచార్య’ టెంపుల్ టౌన్ సెట్‌ను చూశారా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఓ అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ‘ఆచార్య’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం తాజాగా కోకాపేటలో టెంపుల్ టౌన్ సెట్ వేశారు. ఇప్పుడు ఈ టెంపుల్ టౌన్ రికార్డ్ సృష్టించింది. దీని ప్రత్యేకత ఏంటంటే... దీని నిర్మాణం 20 ఎకరాల్లో జరిగింది. మన దేశంలోనే ఒక సినిమా కోసం ఇన్ని ఎకరాల్లో సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ సినిమా సెట్ రికార్డులకెక్కింది.
అయితే ఈ టెంపుల్ టౌన్ సెట్ గురించి వినడమే కానీ.. చూశారా? అంతటి అద్భుతమైన సెట్‌ను చూడాలన్న ఆసక్తి ఎవరికుండదు? చూస్తే మాత్రం వావ్.. అనక మానరు. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. దీనిని మెగాస్టార్ తన కెమెరాలో బంధించి అభిమానుల కోసం ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అద్భుతమైన టెంపుల్ టైన్ సెట్ ‘ఆచార్య’ కోసం వేశారు. అద్భుతమైన కళకు నిదర్శనం. మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను’ అంటూ చిరు ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో.. బీభత్సమైన వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. అంతటి అద్భుతమైన సెట్‌ను వేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఒక కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రామ్ చరణ్ కోసం ఈ సినిమాలో ఒక పాటను కూడా పెట్టబోతున్నారని టాక్. ఈ చిత్రంలో చెర్రీ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా.. మేలో విడుదల కానుంది.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn't stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com