చిరంజీవి - కొరటాల చిత్రానికి భారీ ప్లాన్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి... పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద సక్సెస్‌నే సొంతం చేసుకున్నారు. తర్వాత ప్యాన్ ఇండియా చిత్రంగా `సైరా నరసింహారెడ్డి`ని సిద్ధం చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. తెలుగు మినహా మరో భాషలో సైరా నరసింహారెడ్డి మెగాక్యాంప్‌కు నిరాశనే మిగిల్చింది. మేకింగ్ భారీగానే ఉన్నా, కాన్సెప్ట్ మాత్రం ఆడియెన్స్‌కు నచ్చలేదు.
ఇప్పుడు మెగాస్టార్ తన 152వ సినిమాకు రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే విడుదల చేయాలని మరోసారి మెగాక్యాంప్ భావిస్తోందట. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
సాధారణంగా యూనివర్సల్ కాన్సెప్ట్స్‌తో సినిమాలను కొరటాల తన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. చిరు 152వ సినిమా కూడా దేవదాయ శాఖలోని అవినీతి ప్రశ్నించే కథాంశంతో రూపొందనుందట. దీనికి ఇప్పుడు ప్యాన్ ఇండియా మెరుగులు దిద్దుతున్నారట. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతా ఓకే అయితే 2020 ఆగస్ట్ 14న సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com