ఫిల్మ్ సిటీలో మెగాస్టార్ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
`ఖైదీ నంబర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారికల్ డ్రామా `సైరా.. నరసింహారెడ్డి`తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. రెండు వరుస బ్లాక్‌బస్టర్స్‌తో తన స్టామినా ఏంటో మరోసారి తెలియజేసిన చిరు... ప్రస్తుతం నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై తన ఫోకస్‌ని షిప్ట్ చేశారు. `మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను` వంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తన 152వ చిత్రం చేయబోతున్నారు చిరు.
కొరటాల గత చిత్రాల తరహాలోనే మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న మెగాస్టార్ 152కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ వర్క్ ఫినిషింగ్ స్టేజెస్‌లో ఉందని... నవంబర్ నుంచి నిరవధికంగా చిత్రీకరణ సాగుతుందని సమాచారం. అంతేకాదు... రామోజీ ఫిల్మ్ సిటీలో ఇరవై రోజుల పాటు తొలి షెడ్యూల్ సాగుతుందని... ఈ భారీ షెడ్యూల్‌లో పలు కీలక ఘట్టాలను దృశ్యీకరిస్తారని టాక్.
`ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి` చిత్రాలను నిర్మించిన చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. అయితే, గత రెండు సినిమాల తరహాలో సోలోగా కాకుండా మ్నాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలసి చరణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం.
మరి... తాజా ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు చూసిన చిరు... నెక్ట్స్ మూవీతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com