నాకు, చిరంజీవికి మధ్య గొడవలేం లేవు... మోహన్‌బాబుని ముద్దాడిన చిరు
- IndiaGlitz, [Thursday,January 02 2020]
'మా' డైరీ ఆవిష్కరణలో అసోసియేషన్ మధ్య ఉన్న విబేదాలు బయటపడ్డాయి. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజు వంటివారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై మోహన్‌బాబు తనదైన శైళిలో ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు మోహన్‌బాబు. ''ఇండస్ట్రీలో అందరూ ఒకే తల్లి బిడ్డలం. మా మధ్య ఛలోక్తులు మాత్రమే నడుస్తుంటాయి. గొడవలు ఉండవు'' అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు మాటలకు పక్కనే చిరంజీవి ఆయన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా ముద్దు పెట్టుకున్నారు.
ఇప్పుడు చిరు, మోహన్‌బాబు ఆత్మీయ ఆలింగనం, ముద్దు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ''నా కుటుంబం, చిరంజీవి కుటుంబం ఒకటే. మాలో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. అయితే మేమందరం ఒకే తల్లి బిడ్డలం. ఎన్నికలు వస్తుంటాయి. ఇక్కడేదీ శాశ్వతం కాదు. ఇకపై మాలోని మీటింగులకు నన్ను పిలవొద్దని నేను చిరంజీవిని కోరుతున్నాను. ఎందుకంటే నేనెదైనా కోపంలో వారినేదైనా అనేస్తాను. నాకు రాజశేఖర్ అంటే ఇష్టమే. ఐ లవ్ యు రాజశేఖర్. మా ఎవడి సొత్తు కాదు.. ఇది అందరిది. సవాళ్లు చేసుకోకుండా కలిసి ముందుకు పోవాలని, కలిసి మెలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు మోహన్ బాబు.