మెగాస్టార్ ఖైదీ నెం 150 షూటింగ్ పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈరోజుతో ఖైదీ నెం 150 షూటింగ్ పూర్తయ్యింది అంటూ బెస్ట్ టీమ్ దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, వినాయక్ గారు తో వర్క్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
అలాగే ఈ మూవీకి వర్క్ చేయడం ద్వారా కాస్టూమ్స్ విషయంలో ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరి నుంచి చాలా నేర్చుకున్నాను అని సుస్మిత తెలియచేసారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఆడియోను రిలీజ్ చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments