చిరు ఫంక్షన్ కి గెస్ట్ లు వీళ్లే..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈనెల 7న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ - గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు అని రామ్ చరణ్ తెలియచేసారు. అయితే....ఈ వేడుకకు పవన్ వస్తాడా రాడా అనేది సస్పెన్స్ గానే ఉంది. కారణం ఏమిటంటే...
బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నాను. అయితే వస్తారా లేదా అనేది ఆయన వీలును బట్టి ఉంటుంది అని చెప్పారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఖైదీ నెం 150 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 11న రిలీజ్ చేయనున్నట్టు తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments