చిరు ఖైదీ నెం150 మోషన్ పోస్టర్ రిలీజ్..

  • IndiaGlitz, [Monday,August 22 2016]

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అభిమానుల‌కు పండుగ రోజు. ఈ పండుగ రోజున అభిమానుల‌కు చిరు 150వ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి రామ్ చ‌ర‌ణ్ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఈచిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.
డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. వ‌చ్చేసాడు మ‌న‌కోసం మ‌న ఎవ‌ర్ గ్రీన్ హీరో...బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న ఖైదీ నెం 150 మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఖైదీ నెం 150 చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.