మెగాస్టార్ మూవీ ఆడియో రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150`. ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. దీంతో చిత్రీకరణ అంతా ముగిసినట్టే. చిత్రీకరణకు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 11 లేదా 12న గానీ విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో డిసెంబర్ 25న నిర్వహించనున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments