Chiranjeevi:'విశ్వంభర' షూటింగ్‌లో జాయిన్ అయిన చిరంజీవి.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా మూవీ టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

మూవీలో 70 శాతం VFX సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌తో కలిసి.. యాక్షన్ పార్ట్ డిజైన్ క్లాస్‌లు కూడా నిర్వహించారు. ఇక ఈ చిత్రంలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో శరవేగంగా జరగుతోంది. తాజాగా మూవీ షూటింగ్‌లో చిరు పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

మండుతున్న అగ్నిగోళం నుంచి చిరంజీవి బయటకు వస్తున్నట్లు ఉన్న షాడోను చూపించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న మూవీని రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇక షూటింగ్‌లో పాల్గొనే ముందు చిరు జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన విషయం విధితమే. బాడీ మెయింటైన్‌ చేయడం కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. అన్ని రకాల వర్క్‌వుట్స్ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అన్నయ్య కమిటెమెంట్‌ను మెచ్చుకుంటున్నారు. 68 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా గతేడాది రెండు సినిమాలతో అభిమానులను పలకరించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకోగా.. మెహర్ రమేశ్‌ డైరెక్ట్ చేసిన 'భోళాశంకర్' మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో 'విశ్వంభర' మూవీతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన కుమార్తె సుష్మిత నిర్మాణంలో మరో సినిమా చేయనున్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘బ్రో డాడీ’కి రీమేక్‌గా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాకు బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. అలాగే మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

More News

2047 నాటికి భారత్‌ అభివృద్ధే లక్ష్యం.. బడ్జెట్ విశేషాలు ఇవే..

2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు.

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

ప్రభుత్వ సలహాదారుల కోసమే వైసీపీ ప్రభుత్వం రూ.680కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు

నాగోబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నేతలు

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా నిలిచింది. నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తారు.

పేద పిల్లలకు పెద్ద చదువులు చెప్పించేలా సీఎం జగన్ కార్యాచరణ

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే విద్యారంగంలో సంస్కరణలకు తెరలేపారు. ఇందులో భాగంగా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారు.

సీఎం రేవంత్ రెడ్డి నా మిత్రుడు.. ఇద్దరం కలిసి పనిచేశాం: మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తాను మంచి మిత్రులమని వ్యాఖ్యానించారు. ఇద్దరం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశామని గుర్తు చేశారు.