12 ఏళ్ల 'జై చిరంజీవ'
Send us your feedback to audioarticles@vaarta.com
జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి, టాప్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం జై చిరంజీవ. అలాగే స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్స్ తరువాత దర్శకుడు కె.విజయ్ భాస్కర్, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. ఇలాంటి కాంబినేషన్‌లలో సినిమా అంటే ఆ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే ఆ అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా.. కామెడీ పరంగా జై చిరంజీవ బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి. సునీల్, వేణు మాధవ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్.. ద్వితీయార్థంలో బ్రహ్మానందంతో వచ్చే కామెడీ సీన్స్‌లోనూ చిరు అదరగొట్టేశారు. ఇక డ్యాన్స్‌ల విషయంలోనూ మరోసారి రాణించారు చిరు. మణిశర్మ సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలు చిరు అభిమానులను అలరించాయి. భూమిక, సమీరా రెడ్డి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21, 2005న విడుదలైంది. అంటే.. నేటితో ఈ సినిమా విడుదలై 12 సంవత్సరాలు పూర్తవుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com